వేమన పద్యాలు

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టుబైట కుక్క చేత భంగ పడునుస్థానబల్మిగాని తన బల్మిగాదయావిశ్వదాభిరామ! వినుర వేమ!
ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకుపరగ మూలికలకు పనికివచ్చు.నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?విశ్వదాభిరామ! వినుర వేమ!
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడుపుట్టనేమి వాడు గిట్టనేమిపుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?విశ్వదాభిరామ! వినుర వేమ!
వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచునుచీడపురుగు చేరి చెట్టు చెఱచుకుత్సితుండు చేరి గుణవంతు చెఱచురావిశ్వదాభిరామ! వినుర వేమ!
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలుతళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా?చాటు పద్యమిలను చాలదా యొక్కవిశ్వదాభిరామ! వినుర వేమ!
మేడిపండు చూడ మేలిమై యుండునుపొట్ట విచ్చి చూడ పురుగులుండుపిరికివాని మదిని బింకమీలాగురావిశ్వదాభిరామ! వినుర వేమ!
అనువుగానిచోట నధికులమనరాదుకొంచెముండుటెల్ల కొదువ గాదుకొండ అద్దమందు కొంచమై యుండదా?విశ్వదాభిరామ! వినుర వేమ!
గంగిగోవు పాలు గరిటెడైనా చాలుకడివెడైన నేమి ఖరము పాలుభక్తిగలుగు కూడు పట్టెడైనను చాలువిశ్వదాభిరామ! వినుర వేమ!
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండుచూడచూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య పురుషులు వేరయావిశ్వదాభిరామ! వినుర వేమ!
అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ! వినుర వేమ!